కెసిఆర్‌కు సరదా, జగన్ రాత్రికి రాత్రే కలిపేస్తాడు: బాబు

ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ పైన ఆయన మండిపడ్డారు. ఇది ప్రజల వ్యతిరేక బడ్జెట్ అన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. సామాన్యులను దోచేలా బడ్జెట్ ఉందన్నారు. రాయితీలు తగ్గించి పన్నులు పెంచారని విమర్శించారు. వ్యవసాయం ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో రైతులకు ఎలాంటి హామీ లేదన్నారు. ప్రణబ్ సబ్సిడీలు తగ్గించడం బాధాకరమని టిడిపి నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. వ్యవసాయ సంస్కరణల గురించి బడ్జెట్‌లో చోటు ఏదన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదని పెద్దల బడ్జెట్ అన్నారు. భద్రత గురించి కేంద్రం ఇప్పుడు మాట్లాడటం శోచనీయమన్నారు. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేలా లేదన్నారు.












Click it and Unblock the Notifications