డిఎల్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణపై పార్టీకి సూచన

నేతలు పార్టీలోని కేడర్‌కు ఆత్మవిశ్వాసం కల్పించకపోతే కాంగ్రెసుకు తీవ్ర నష్టం కలిగే అవకాశముందన్నారు. పార్టీ కష్టాల్లో కూరుకు పోతుందన్నారు. అయితే నాయకత్వ మార్పు సమస్యకు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు వల్ల వచ్చేదేమీ లేదన్నారు. కేడర్‌లో విశ్వాసం కల్పిస్తే చాలన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిని ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. ఓటమికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. రాజీనామా చేయాలా లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు అధిష్టానానికి పంపాలన్నారు. తెలంగాణపై కూడా అధిష్టానం ఆలోచించాలని డిఎల్ సూచించారు.












Click it and Unblock the Notifications