చివరి ఎన్నికలు వారికే: చంద్రబాబు వ్యాఖ్యలపై కెసిఆర్

K Chandrasekhar rao
హైదరాబాద్: ఎవరికి చివరి ఎన్నికలు అయ్యాయో తేలిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. తెరాసకు ఇవి చివరి ఎన్నికలని, కెసిఆర్ తొక్కుతానని, తాను తలుచుకుంటే కెసిఆర్ తెలంగాణలో తిరగలేరని చంద్రబాబు గతంలో అన్న విషయాలను ఆయన గుర్తు చేస్తూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్థానం లేదని తెలంగాణ ప్రజలు తేల్చి చెప్పారని, తెలుగుదేశం పక్కా ఆంధ్రా పార్టీ అని తేలిపోయిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీకి దిక్కు లేదని తేలిపోయిందని ఆయన అన్నారు.

మహబూబ్‌నగర్‌లో తెలంగాణవాదమే గెలిచిందని, కొద్ది మెజారిటీతో తమ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. ప్రజలు తెలంగాణవాదాన్ని బలపరిచారని, ఈ విషయాన్ని గుర్తించి తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు బయటకు రావాలని ఆయన అన్నారు. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్ర సాధన వైపు సాగుతామని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు ప్రజలు తెలంగాణవాదాన్నే గెలిపించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానిని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై నీలాపనిందలు వేశారని, గోబెల్స్ ప్రచారం చేశారని, అయినా తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని విశ్వసించలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి మూడు చోట్ల డిపాజిట్ పోయిందని, రెండు చోట్ల మూడో స్థానంలో నిలిచిందని, దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీని ప్రజలు విశ్వసించలేదని తేలిపోయిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు జ్ఝానోదయం కలిగించాలని ఆయన ఆశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+