కెసిఆర్‌కు బిజెపి తెలంగాణలో కళ్లెం వేస్తుందా?

K Chandrasekahar Rao - Kishan Reddy
హైదరాబాద్: మహబూబ్‌నగర్ విజయం బిజెపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను పక్కకు తోసేసి, తెలంగాణ జెఎసిని పక్కన పెట్టి మహబూబ్‌నగర్‌లో పోటీకి తన అభ్యర్థిని పోటీకి దింపినందుకు బిజెపికి తగిన ఫలితం వచ్చినట్లే. కాంగ్రెసు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని, తెలంగాణ ఇచ్చే సత్తా జాతీయ పార్టీగా తమకు మాత్రమే ఉందని తాము పెట్టిన వాదనకు తెలంగాణ ప్రజల నుంచి మద్దతు లభించిందిని బిజెపి నాయకత్వం భావిస్తోంది. మహబూబ్‌నగర్‌లో విజయం సాధించిన తర్వాత బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్‌లో విజయం సాధించిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందుకు అనుగుణంగా ప్రకటనలు చేశారు.

మహబూబ్‌నగర్ ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ అంతటా ఇదే వైఖరిని తీసుకుని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కళ్లెం వేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణవాదంతో తెలంగాణలో పుంజుకోవడానికి గత కొంత కాలంగా బిజెపి తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. సుష్మా స్వరాజ్ వంటి నేతలను తెలంగాణకు తీసుకుని వచ్చి తెలంగాణ ఇస్తామనే నమ్మకాన్ని కలిగించడానికి రాష్ట్ర నాయకులు ప్రయత్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ ఫలితం తమ కృషికి గుర్తుగా వారు భావిస్తున్నారు. తెరాసతో కొనసాగుతూ వచ్చిన బిజెపి తెలంగాణలో ఇక స్వతంత్రంగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.

తెలంగాణలో సమీప భవిష్యత్తులో పరకాలకు తప్ప మరెక్కడా ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. దీంతో 2014లో వచ్చే ఎన్నికల నాటికి మరింత పుంజుకుంటామని బిజెపి నాయకులు భావిస్తున్నారు. తెరాస తనంత తానుగా తెలంగాణను తేలేదని, దానికి జాతీయ పార్టీల అవసరం ఉంటుందని, రెండు ప్రధాన జాతీయ పార్టీల్లో కాంగ్రెసు తెలంగాణను ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి తాము మాత్రమే ఇస్తామని చెబుతూ తెలంగాణలో తమ పట్టును బిగించాలని బిజెపి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో సిహెచ్ విద్యాసాగర రావు వంటి మితవాదులు కూడా ఉన్నారు. వారు తెరాసతోనూ తెలంగాణ జెఎసితోనూ కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నారు. కిషన్ రెడ్డి వంటి నాయకులు మాత్రం స్వతంత్రంగా ముందుకు సాగడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+