విశ్వసనీయతకు పట్టం: కోవూరు ఫలితంపై వైయస్ జగన్

YS Jagan
గుంటూరు: విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరు ఫలితంపై అన్నారు. కోవూరులో తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పందించారు నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగానే కోవూరు ఉప ఎన్నిక ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అందించిన విజయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన అన్నారు.

విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. వైయస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని ప్రజలు ఓటేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చిరంజీవి ప్రచారం చేసినా కోవూరులో కాంగ్రెసు ఓడిపోయిందని ఆమె అన్నారు. వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా తప్పుడు వార్తా కథనాలు తన అపజయానికి పనికి చేశాయని తెలుగుదేశం పార్టీ కోవూరు అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+