ఢిల్లీ బాట పట్టనున్న కిరణ్ వ్యతిరేక వర్గం, ఫిర్యాదుకే!

DL Ravindra Reddy - Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో ఉన్న నేతలు ఈ నెలాఖరున ఢిల్లీ బాట పట్టనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. కిరణ్ తీరుపై వారు అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి డిఎల్ ఇటీవలి కాలంలో సిఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చిరంజీవి వర్గం నేతలను కేబినెట్లోకి తీసుకున్న సమయంలో డిఎల్ శాఖలకు కిరణ్ కోత పెట్టారు. అప్పటికే సిఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డిఎల్ శాఖల కోతతో ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిఎంను మార్చాలని బహిరంగంగా డిమాండ్ చేయక పోయినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఇటీవల ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కిరణ్‌ను డిమాండ్ చేశారు. అయితే కిరణ్ పైన అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఈ నెల 28న ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడూతూ.. సిఎంను మార్చే వైఖరి సోనియాది కాదని అన్నారు. రాష్ట్రాన్ని అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

కిరణ్‌ను ముఖ్యమంత్రి స్థానం తొలగించాలని మొదటి నుండి లక్ష్యంగా పెట్టుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా 29న ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మార్చాల్సిందేనని, అప్పుడే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని ఆయన తన వాణి వినిపించనున్నారని తెలిస్తోంది. సిఎంను మార్చేందుకు అధిష్టానం అంగీకరించని పక్షంలో అక్కడికి అక్కడే పార్టీకి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సిఎంను తప్పించకుంటే తాను కాంగ్రెసుకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సిఎంపై అసంతృప్తితో ఉన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ 30వ తేదిన ఢిల్లీ వెళ్లే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+