బొత్స, కిరణ్ ఫైట్: ఉప ఎన్నికలపై పార్టీలో ఆందోళన

Kiran Kumar Reddy-Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భవితపై ఆ పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయట. కిరణ్, బొత్సల మధ్య ఏర్పడ్డ అగాధం త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళన పాలకపక్షం నేతల్లో వ్యక్తమవుతోందని అంటున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న పద్దెనిమిది శాసనసభా, ఎస్పీఎస్ నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన బొత్స, అభివృద్ధి ద్వారా ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేయాల్సిన కిరణ్‌ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటున్న తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. సీమాంధ్రలో విజయనగరం, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉప ఎన్నికలు జరగనున్నాయి.

అదేవిధంగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. నిజానికి, తాజాగా జరిగిన ఏడు శాసనసభా నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్‌ను రాజకీయంగా అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరాజయం పాలైతే, రాష్ట్రంలో ఆ పార్టీ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న అసెంబ్లీ స్థానాలూ కాంగ్రెస్‌కే చెందినవి కావడంతో గెలిచి తీరాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. ఇలాంటి కీలక సమయంలో మద్యం ముడుపుల కేసు వ్యవహరం బొత్స, కిరణ్ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తారస్థాయికి తీసుకెళ్లింది.

ప్రస్తుతం పార్టీలోని రాష్ట్ర సారథుల మధ్య నెలకొన్న అనైక్యత ఇదే విధంగా కొనసాగితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితాలు వస్తాయని ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీకి పలువురు రాష్ట్ర నేతలు ఇప్పటికే చెప్పారట. దీంతో, ఎప్పుడూ లేని విధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఉప పోరు విషయమై రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌లోని రాష్ట్ర ఎంపీలతో ఢిల్లీలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఆజాద్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీలు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆందోళన వెలుబుచ్చారు. ప్రధానంగా సిఎం, పిసిసి చీఫ్ మధ్య ఉన్న విభేదాలపై వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పరిస్థితిని చక్కదిద్ది పార్టీ రాష్ట్ర సారథుల మధ్య సయోధ్య నెలకొల్పాలని ఆజాద్‌కు ఎంపీలు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+