పార్టీని గౌరవించాలి: నారా-నందమూరి విభేదాలపై బాబు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసు విషపు చెట్టులోని ఓ కొమ్మ అన్నారు. నాకు వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం ఉపయోగించుకోలేదని ప్రజల కోసమే వినియోగించానన్నారు. అవినీతిలేని భారత్‌ను నిర్మించాలనేది తన కోరిక అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రజారాజ్యం పార్టీని కలుపుకొని 2014లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూసిందన్నారు. కానీ ఇంతలో జగన్ పార్టీ వైయస్సార్ కాంగ్రెసు వచ్చిందన్నారు. ఇప్పటికే పిఆర్పీని కాంగ్రెసు విలీనం చేసుకుందన్నారు.
తెలంగాణపై స్పందిస్తూ.. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అన్నారు. తెలంగాణపై మేం కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదన్నారు. టిడిపికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. మాకు ఎప్పుడూ క్లిష్ట పరిస్థితే అన్నారు. అయినా వాటిని అధిగమిస్తున్నామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా టిడిపిని దెబ్బతీయాలని చూశారన్నారు. తెలంగాణ విషయంలో వైయస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications