హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అరెస్టవుతారా, ప్రశ్నించనున్న ఈడి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయనను అరెస్టు చేసే పరిస్థితి వస్తే అంతకుముందు ఆయనను తన కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ప్రశ్నించే అవకాశముందని అంటున్నారు. జగన్‌ను అరెస్టు చేసేందుకు సిబిఐ ఇప్పటికే మూడుసార్లు ప్రయత్నించి విఫలమైందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

జగన్ కేసులో సిబిఐ శనివారం కోర్టులో అరవై ఎనిమిది పేజీలతో కూడిన ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌తో సహా పదమూడు మంది పేర్లను సిబిఐ ఛార్జీషీట్‌లో పేర్కొంది. ఛార్జీషీట్‌లో జగన్‌ను ఎ-1గా పేర్కొంది. జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని ఎ-2గా పేర్కొన్నారు. కాగా శనివారం సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో జగన్‌ను ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చుననే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే ఆరుగురు మంత్రులు సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందుకున్నారు. దీంతో కాంగ్రెసు ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని అంటున్నారు.

English summary
While facing the repercussion, YSR Congress president Jagan Reddy is likely to face arrest by Central Bureau of Investigation (CBI) soon in disproportionate asset case, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X