ప్రకంపనలు: కలెక్టర్లను అప్రమత్తం చేసిన సిఎం

సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలను అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రానికి దూరంగా ఉండాలని సూచించారు. సముద్రానికి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తిరుపతిలో రెండో సారి భూమి ప్రకంపించింది. రెండున్నర గంటల పాటు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌జిఆర్ఐ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. అయితే, ప్రమాదం ఉండకపోవచ్చునని అంటున్నారు. రాజమండ్రిలో కూడా రెండోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నెల్లూరు జిల్లా కావలిలో సముద్రంతీరంలో 2 మీటర్ల మేర నీరు ఎగిసిపడుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. సముద్రంలోకి వెళ్లకూడదని జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి పరిస్థితిని అధికారులతో టెలిఫోన్‌లో సమీక్షించారు. భారత్‌కు సునామీ వస్తుందనే వస్తుందనే సమాచారాన్ని నమ్మవద్దని ఎన్ఎండిఎ సూచించింది. అవసరమైతే పునరావాస చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోస్తాంధ్ర జిల్లాల అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం వద్ద సముద్రంలో తరంగణి నౌక చిక్కుకుంది. అందులో ఏడుగురు విద్యార్థులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. సాంకేతిక లోపం వల్ల నౌక ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఏ విధమైన పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ కార్యదర్శి వికె సింగ్ చెప్పారు. ఒడిషా, ఆంధ్ర, తమిళనాడు ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఏ విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. హిందూ మహా సముద్రంపై సునామీ ప్రభావం లేదని, అండమాన్ నికోబార్ దీవులకు కూడా ప్రమాదం లేదని జాతీయ విపత్తుల సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications