మమతను మోక్ చేస్తూ తృణమూల్ ఎంపి పాట

మహాపాత్ర అరెస్టుతో పశ్చిమ బెంగాల్ సామాన్య ప్రజల్లోనే కాకుండా మేధావుల్లో కూడా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. మమతా బెనర్జీ తీసుకున్న చర్యలను విమర్శిస్తూ కబీర్ సుమన్ ఇదివరకు పాటలు, బ్లాగ్స్ రాశారు. ఇప్పుడు నేరుగా పాటనే కంపోజ్ చేశారు. నవ్వుతూ బతకండి, నవ్వు ముఖంతో జీవించండి, వేదనలోనూ బెంగాల్ ప్రజలు నవ్వుతూనే ఉండాలి అనేది ఆ పాట సారాంశం.
తాను ఫేస్‌బుక్‌లో ఉన్నానని, నవ్వుతూ ఆనందంగా ఉన్నానని, నవ్వుతూ పాడుతానని, నాకు కూడా రోజులు దగ్గరపడవచ్చు, నా నవ్వుకు పదును పెట్టుకోనివ్వండి, నవ్వుతూ ఉండాలి అని కబీర్ సుమన్ అన్నారు. తూర్పు కోల్‌కత్తా నోనదంగా మురికివాడలపై పోలీసు చర్యను వ్యతిరేకిస్తూ, పార్క్ స్ట్రీట్ రేప్ కేసును పరిష్కరించడంలో ముందడుగు వేసిన పోలీసు అధికార దమయంతి సేన్ బదిలీని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆయన ఓ పాట రాశారు.
పార్టీలోని కొంత మంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుమన్ విమర్శించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సంయుక్త బలగాల ఆపరేషన్‌ను ఆయన వ్యతిరేకించారు. దీంతో ఆయనకు పార్టీతో సంబంధాలు దెబ్బ తిన్నాయి. జీబోన్ ముఖ్‌తో 1990లో ఆధునిక బెంగాలీ సంగీతాన్ని మలుపు తిప్పిన ఖ్యాతి సుమన్‌కు ఉంది.












Click it and Unblock the Notifications