బిజెపిలోకి సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నేపథ్యంలో వారు అప్పుడు కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర రెడ్డి వారిద్దరిని కాంగ్రెసులోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారం కూడా పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వారు కొంత కాలం వైయస్ జగన్‌తో ఉన్నారు. కానీ వైయస్ జగన్‌తో వారికి పొసగినట్లు లేదు. దాంతో జగన్‌కు వారు దూరమయ్యారు.
తెలుగుదేశం పార్టీలో చేరడానికి జీవిత, రాజశేఖర్ తీవ్రంగానే ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారు పెట్టిన షరతులు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నచ్చలేదని, దాంతో తెలుగుదేశం పార్టీలో వారిని చేర్చుకోలేదని వార్తలు వచ్చాయి. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
చివరకు బిజెపిలో చేరడానికి రాజశేఖర్, జీవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి నాయకులతో వారు చర్చలు జరిపి, తమకు ఇమేజ్‌కు తగిన విధంగా వెంకయ్యనాయుడి సమక్షంలో బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి, రాజశేఖర్ దంపతులకు మధ్య ఏ మాత్రం పడదు.












Click it and Unblock the Notifications