జగన్ జిల్లాలో ఉప పోరు సిఎంకు అగ్నిపరీక్షే

Kiran Kumar Reddy
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అగ్నిపరీక్షే పెట్టనున్నాయి. కడప జిల్లాలో మూడు శానససభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రైల్వే కోడూరు (ఎస్‌సి), రాజంపేట, రాయచోటి స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు కూడా సాయి ప్రతాప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజంపేట లోకసభ నియోజకవర్గంలో ఉన్నాయి.

కాంగ్రెసు పార్టీకి చెందిన సాయి ప్రతాప్ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన వల్లనే సాయి ప్రతాప్‌కు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. అయితే, ఆ తర్వాత ఆయనను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గం నుంచి తొలగించారు. కాంగ్రెసు నాయకులు కొంత మంది వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తుండడాన్ని సాయి ప్రతాప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎప్పుడైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

కడప జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి, మహ్మద్ అబ్దుల్లా, సి. రామచంద్రయ్య. అయితే, ముఖ్యమంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డిఎల్ రవీంద్రా రెడ్డి ఉప ఎన్నికల సమరానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఉప ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు లేవు. మంత్రి సి. రామచంద్రయ్య పూర్తిగా వైయస్ జగన్‌ను ఎదుర్కోగలరా అనేది ప్రశ్నార్థకమే. పైగా, వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

దానికితోడు, గత ప్రజారాజ్యం పార్టీ నాయకులు, కిరణ్ కుమార్ రెడ్డి కుల ప్రాతిపదికపై పూర్తిగా పరస్పరం విభేదిస్తున్నారు. రాజంపేట నుంచి బలిజ సామాజిక వర్గంలో బలమైనవాడిగా పేరున్న చెంగల్రాయుడును, రాయచోటి నుంచి ముస్లిం మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని డిమాండ్ ఉంది. అయితే, ఆ డిమాండ్‌ను కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. రాజంపేటకు మేడా మల్లికార్జున్ రెడ్డి పేరును, రాయచోటికి ఎం రాంప్రసాద్ రెడ్డిని ముఖ్యమంత్రి సిఫార్సు చేసినట్లు సమాచారం. దీంతో ఒక వర్గం నాయకులు పార్టీకి సహకరించే అవకాశాలు లేవని అంటున్నారు.

కాగా, తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గంలో బలంగా ఉన్న పసుపులేటి బ్రహ్మయ్యను రాజంపేట నుంచి పోటీకి దించుతోంది. పైగా, మజ్లీస్ తమ అభ్యర్థులను రంగంలోకి దించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాయలసీమలో ఇటీవల పర్యటించారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాలో ప్రజాపథం నిర్వహించారు. రైల్వే కోడూరులో ఆయన నిర్వహించిన ప్రజాపథానికి సాయి ప్రతాప్ హాజరయ్యారు. మొత్తం మీద కడప జిల్లాలోని ఉప ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డికి అగ్నిపరీక్షనే అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+