రైలు నుంచి దూకేశారు: కింద పడి మరణించారు

ముంబైకి చెందిన శాంతిలాల్ జైన్ విహారయాత్రకు ఒడిషా వచ్చారు. రాజమండ్రిలో ఉన్న బంధువులను కలవడానికి భువనేశ్వర్‌లో ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ బోగీలో ఎక్కారు. తర్వాత బరంపురం వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇదే బోగీలో ఎక్కారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఆ ముగ్గురు వ్యక్తులు, శాంతిలాల్ జైన్ వద్దకు వచ్చి బ్యాగును అపహరించడానికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన శాంతిలాల్‌ను కత్తితో గాయపరిచారు. దీంతో శాంతిలాల్ వేసిన కేకలకు ప్రయాణికులంతా మేల్కొని అప్రమత్తమయ్యారు. దీంతో దొంగలు వారిపై కూడా కత్తితో దాడి చేశారు.
గాయపడిన శాంతిలాల్ జైన్‌ను, ఇతరులను చికిత్స కోసం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కాగా, పెందుర్తి-నార్త్ సింహాచలం స్టేషన్‌ల మధ్య చింతల అగ్రహారం గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై మృత దేహాలు పడివున్నాయనిస్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి పరిశీలించగా, రెండు మృతదేహాలు కనిపించాయి. తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య ఉన్న మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు.
ఈ సమాచారాన్ని పెందుర్తి పోలీసులు, రైల్వే పోలీసులకు తెలియపరిచారు. రైల్వే ఎస్పీ కాంతారావు, డీఎస్‌పీ భీమారావు, సీఐ కె.బాలకృష్ణ, నార్త్ ఏసీపీ బర్ల ప్రసాదరావు, తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుల జేబుల్లో పాన్‌కార్డులు, సెల్‌ఫోన్ లభించాయి. వీటి ఆధారంగా మృతులను కె.దయారాం, టీకే మహంతిగా గుర్తించారు. మరొకరి వివరాలు లభ్యం కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు నుంచి దూకినపుడు మరో రైలు కిందపడడంతో మృతిచెందారని రైల్వే పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications