భాను తెలియదు: సబిత కొడుకు కార్తీక్, బాబుపై సెటైర్

మద్దెలచెర్వు సూరి హత్యతో తనకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు. సూరి, భానులలో ఎవరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కాదని చెప్పారు. వారితో తనకు పరిచయం కూడా లేదన్నారు. ఈ కేసులో తనకు సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని సీనియర్ పోలీసు అధికారి రమణమూర్తి ఇప్పటికే తేల్చి చెప్పారని కార్తీక్ రెడ్డి గుర్తు చేశారు.
అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ తనను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తన పేరు పలికితే తప్ప చంద్రబాబుకు నిద్ర రాదని ఎద్దేవా చేశారు. భాను కేసు వివరాలు తన అమ్మ సబితా ఇంద్రా రెడ్డికి, సిఐడి అధికారులకు మాత్రమే తెలుసునని ఆయన చెప్పారు.
కాగా భాను కిరణ్‌తో సబిత ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు మూడు రోజుల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలను సబితా ఇంద్రా రెడ్డి అప్పుడే ఖండించారు. అనవసరంగా తన తనయుడిని ఈ వివాదంలోకి లాగవద్దని సూచించారు. తాజాగా కార్తీక్ రెడ్డి స్పందించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications