జగన్ సిఎం కావాలని ప్రజలు చూస్తున్నారు: గిరిబాబు

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు అవమానకర ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే కనీసం రెండు లేదా మూడు సీట్లు గెలవాలని ఆ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి భారీగా వలసలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర హోం మంత్రి చిదంబరంతో తెలుగదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టమైందని ఆయన అన్నారు. దీంతో ప్రజలకు ఎలా సర్దిచెప్పుకోవాలో అర్థం కాని అయోమయంలో తెలుగుదేశం నాయకులు పడ్డారని గిరిబాబు అన్నారు. ఆయన ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తోడుదొంగలై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయిందని వారన్నారు. మెదక్ జిల్లా బొల్లారంలో శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జూపూడి ప్రభాకర రావు, వంగపండు ఉష, విజయచందర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications