హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐకి సోమవారం సాక్షి మీడియా స్టాఫ్‌పై నివేదిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Media
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఉద్యోగుల వివరాలను అందించేందుకు కార్మిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే హదైరాబాద్ ప్రధాన కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగుల వివరాలను కార్మిక శాఖ సిబిఐకి అందించినట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఖాతాల స్తంభన వల్ల ఉద్యోగులు వీధుల్లో పడుతారనే ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో వారి వివరాలను అందించాలని సిబిఐ కార్మిక శాఖను కోరింది.

జగన్‌కు చెందిన ఐదు మీడియా సంస్థల ఉద్యోగు వివరాలను అందించాలని సిబిఐ కోరింది. సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్‌లో 126 మంది, సాక్షి టీవీని నడిపే ఇందిరా టెలివిజన్‌ను నడిపే ఇందిరా టెలివిజన్‌లో 540 మంది ఉద్యోగులు, రిజల్యూట్ మీడియాలో 837 మంది ఉద్యోగులు, గార్నెట్ మీడియాలో 1047 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు బహుశా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలకు సంబంధించినవే కావచ్చు. కాగా, జననీ ఇన్‌ఫ్రాకు సంబంధించిన వివరాలు తెలియడం లేదు.

ఇదిలావుంటే, సిబిఐ అడిగిన ప్రశ్నలకు నివేదిక రూపంలో సమాధానం ఇచ్చేందుకు కార్మిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు ఏడుగురు జాయింట్ కమిషనర్లు, 24 మంది డిప్యూటీ కమిషనర్లను నియోగించినట్లు కార్మిక శాఖ తెలిపింది. రెండువ శనివారం, ఆదివారం సెలవు రోజులైనా వీరంతా సమాచారణ సేకరణలో ఉంటారని కార్మిక శాఖ ప్రకటించింది.

జగన్ మీడియా సంస్థల్లో ప్రత్యక్షంగా ఎంత మంది, పరోక్షంగా ఎంత మంది పనిచేస్తున్నారు, కార్మిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా తదితర వివరాలను తెలియజేస్తూ సిబిఐకి సోమవారం నివేదిక సమర్పిస్తామని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. సాక్షి మీడియా ఉద్యోగుల వివరాలను సిబిఐ ఎందుకు అడిగిందనే విషయంపై ఇంకా సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి.

English summary
According to labour department - it will submit its report on YSR Congress president YS Jagan's Sakshi media staff on Monday. Labour department is collecting the information of Sakshi media staff,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X