కూలిన విమానం, భారతీయులు సహా 15మంది మృతి

దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఇరవయ్యొక్క మందిలో 15మంది మృతి చెందారు. జామ్ సమ్ ఎయిర్ పోర్టు నేపాల్ ఉత్తర మౌంటెయిన్ రేంజ్‌లో ఉంది. ఘటనా స్థలం నుండి ఇప్పటికే ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. జామ్ సమ్ ఎయిర్ పోర్టులో విమానం దిగుతుండగా పక్కనే ఉన్న కొండల్లో కూలిపోయింది. ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక స్థలం. అది ట్రెక్కింగ్ ప్రాంతం. అగ్రి ఎయిర్ నేపాల్‌లో స్థానిక విమానం ఎయిర్ లైన్స్ సంస్థ. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కాగా ఇటీవల రష్యా తయారీ ఆధునాతన ప్రయాణీకుల విమానం ఒకటి బుధవారం ఇండోనేషియాలో అగ్నిపర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా అదృశ్యమైన విషయం తెలిసిందే. ప్రయోగాత్మక ప్రదర్శనలో భాగంగా గాల్లోకి ఎగిరిని ఈ విమానంలో వ్యాపారావేత్తలు, పాత్రికేయులు సహా దాదాపు యాభై మంది వరకు ఉన్నారు.
మొదట హైజాక్ గురైందా లేక కూలిపోయిందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే మరుసటి రోజు గురువారం అదృశ్యమైన సుపర్ జెట్ -100 విమానం ఆచూకిని గుర్తించారు. జావా దీవిలో విమానం శకలాలు కనిపించాయి. ఈ ఘటనలో విమానంలో ప్రయాణించిన 48 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications