కెసిఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తాం: భన్వర్ లాల్ వెల్లడి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరకాల అభ్యర్థి కొండా సురేఖ భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ప్రతి నాలుగు గ్రామాలకు కలిపి ఓ బిపిఎల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 15వ తేదీ తర్వాతనే ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఉప ఎన్నికల జరుగుతున్న స్థానాల్లో 17 కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో సోమవారం 35 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ స్థానాల్లో 33, పార్లమెంటు స్థానంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 8,304 మద్యం కేసులు నమైదయ్యాయని ఆయన చెప్పారు. మద్యం అక్రమ తరలింపు కేసుల్లో 2,786 మంది అరెస్టయినట్లు ఆయన చెప్పారు. లక్షా 23 వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరు పది ఓట్లు వేయాలంటూ ప్రలోభపెట్టడంతో పాటు రాయదుర్గం ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థిని కించపరిచేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను కూడా అనుమతించాలని వారు భన్వర్‌లాల్‌ను కోరారు. ఈసిని కలిసినవారిలో పిఎన్వీ ప్రసాద్, కోటంరెడ్డి వినయ్ రెడ్డి, శివకుమార్ ఉన్నారు.












Click it and Unblock the Notifications