వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలహాబాదులో బాంబు పేలుడు: ఆరుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Allahabad Map
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదు జిల్లాలో బాంబు పేలుడు సంభవిందచింది. అలహాబాద్‌లోని కరేలీలో నాటు బాంబు పేలింది. ఈ సంఘటనలో ఆరుగురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

నాటు బాంబును చెత్తకుండీలో పెట్టినట్లు సమాచారం. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఎక్కువగా పిల్లలే. ముఠా తగాదాల కారణంగా ఈ బాంబు పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. చెత్త ఏరుకునే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. స్థానిక అధికార యంత్రాంగం, పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. లక్్నో నుంచి అహ్మాదాబాద్‌కు ఫోరెన్సిక్ నిపుణులు హుటాహుటిన బయలుదేరారు. చెత్తకుండీ వద్ద కొంత మంది పిల్లలు అడుకుంటుండగా, బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. తక్కువ తీవ్ర గల బాంబు కావడంతో నష్టం భారీగా లేదని అంటున్నారు.

తాజా బాంబు పేలుడుతో అలహాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారిస్తున్నారు. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. అయితే, తీవ్రవాద సంస్థ కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Atleast 4 people including 2 children were killed and 12 others injured after a low-intensity country bomb rocked Kareli, Allahabad at 4 pm on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X