మంగలి కృష్ణకు పాస్‌పోర్టు జారీపై సిఐడి దర్యాప్తు

దంతలూరి కృష్ణకు పాస్‌పోర్టు జారీ కావడంలో కడప జిల్లా పోలీసుల పాత్రపై సిఐడి అధికారులు విచారిస్తున్నారు. పోలీసు వెరిఫికేషన్ చేసింది ఆ జిల్లావాళ్లే కాబట్టి ఆ దిశగా సిఐడి అధికారులు ఆలోచన చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన మంగలి కృష్ణ 2001 సూట్‌కేసు బాంబు కేసులో నిందితుడు. ఆయుధాల చట్టం కింద కూడా అతనిపై పలు కేసులున్నాయి.
కర్ణాటకలోని పాత మంగళూర్ ఓడరేవు నుంచి మంగలి కృష్ణ విదేశీ తయారీ ఆయుధాలను కూడా స్మగుల్ చేసినట్లు సిఐడి అధికారులు భావిస్తున్నారు. వాటిని మద్దెలచెర్వు సూరికి, భాను కిరణ్‌కు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వివిధ సెటిల్మెంట్లలో, డబ్బు వసూలులో తన పాత్ర ఉందని కృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది.
సుధాకర్ నాయుడు, సీన అనే వ్యక్తులు మంగలి కృష్ణకు ఆయుధాలు సరఫరా చేసినట్లు, వాటిని అతను సూరికి, భాను కిరణ్‌కు అందించినట్లు చెబుతున్నారు. మంగలి కృష్ణను సిఐడి అధికారులు బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి జూన్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications