జగన్ కేసు: మోపిదేవి అరెస్టు, దిల్‌కుషాకు తరలింపు

గంటన్నర పాటు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి గంటన్నర పాటు విచారించిన తర్వాత మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. అయితే, సిబిఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మోపిదేవి వెంకటరమణ ఇష్టానుసారం జీవోలు జారీ చేశారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది. మోపిదేవి వెంకటరమణను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. మోపిదేవికి సిబిఐ కోర్టు వచ్చే నెల 7వ తేదీ వరకు కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏడు రోజుల పాటు తమ కస్టడీకి మోపిదేవిని అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. మోపిదేవిని ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కార్యాలయంలోనే కుట్ర జరిగిందని, వాన్‌పిక్ వ్యవహారంలో మోపిదేవి సమాచారం ఇవ్వడం లేదని సిబిఐ అన్నది. మోపిదేవని సిబిఐ తమ కస్టడీకి తీసుకుంది. దీంతో ఆయనను సిబిఐ దిల్‌కుషా అతిథిగృహానికి తరలించింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్న ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఒత్తిడి పెరిగింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆయనకు సూచించినట్లు సమాచారం. అయితే, అందుకు ఆయన విముఖత ప్రదర్శించారని తెలిసింది. రాజీనామా చేస్తే తప్పు అంగీకరించినట్లవుతుందని ఆయన చెప్పారని సమాచారం.
మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించాలని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం పెద్దలు ఫోన్ చేసి రాజీనామా చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి నుంచి ఆయనకు అధిష్టానం నుంచి ఆయనకు ఫోన్లు వస్తున్నాయి. కానీ రాజీనామాకు ఆయన కాస్తా మొండికేసినట్లు తెలుస్తోంది. తనను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అధిష్టానం సూచనపై మోపిదేవి న్యాయనిపుణులతో గురువారం ఉదయం చర్చించారు. రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. మోపిదేవి వెంకటరమణ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కలిశారు. అయితే, వారు ఆయనకు ఏ విధమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చూద్దాం అంటూ పొడిపొడిగా మాట్లాడినట్లు తెలిసిందే.












Click it and Unblock the Notifications