హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో రోజు విచారణకు దిల్‌కుషాకు చేరుకున్న జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ శనివారం ఉదయం పది గంటల 10 నిమిషాల ప్రాంతంలో రెండో రోజు సిబిఐ ముందు హాజరు కావడానికి బయలుదేరారు. ఆయన వాహనానికి అడ్డుపడడానికి కొంత మంది కార్యకర్తలు ప్రయత్నించారు. సిబిఐ విచారణ నిమిత్తం దిల్‌కుషా అతిథి గృహానికి బయలుదేరే ముందు జగన్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఆయన చర్చ చేసినట్లు సమాచారం.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, కాంగ్రెసు ఏలూరు శాసనసభ్యుడు ఆళ్లనాని జగన్ నివాసానికి వచ్చారు. వారితో పాటు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కూడా వైయస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఎస్వీ సుబ్బారెడ్డి వంటి పలువురు నాయకులు వైయస్ జగన్‌ను కలిశారు. జగన్‌ను సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

శుక్రవారం తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు విచారించలేదని వైయస్ జగన్ చెప్పారు. సిబిఐ మాత్రమే విచారించిందని ఆయన చెప్పినట్లు సమాచారం. వైయస్ జగన్‌ను ఈ రోజు కూడా సాయంత్రం వరకు విచారిస్తామని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి.

వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు శుక్రవారం ఏడున్నర గంటలకు పైగా విచారించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలతో కలిపి కూడా వైయస్ జగన్‌ను విచారించారు. విడిగా జగన్‌ను సిబిఐ అధికారులు చాలాసేపు విచారించారు.

English summary
YSR Congress president YS Jagan has reached Dilkusha guest house to appear before CBI second day. YS Jagan was questioned ny CBI on friday for about 8 hours. Several leaders met YS Jagan today at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X