తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో తోపులాట, సొమ్మసిల్లిన ఐదుగురు భక్తులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమల క్యూలైన్‌లో శనివారం తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఐదుగురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఉచిత దర్శనం క్యూలైన్‌లో ఈ తోపులాట చోటు చేసుకుంది. నారాయణగిరి వనం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.

దర్శనానికి విపరీతమైన సమయం తీసుకుంటుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళనకు గరువుతున్న క్రమంలోనే తోపులాట జరిగింది. క్యూలైన్‌లు సరిగా నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి దాదాపు 22 గంటల సమయం పడుతోంది. వైకుంఠం దగ్గరకు వచ్చే సరికి భక్తుల ఉత్కంఠ పెరుగుతోంది. తనిఖీలు నిర్వహిస్తున్న ఇవో ఎల్వీ సుబ్రహ్మణ్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు దర్శనం తొందరగా జరగడం లేదని వారు చెప్పారు. వారికి ఇవో సర్ది చెప్పారు.

ఇదిలా ఉంటే తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెసు కార్యకర్తలు బాణసంచా పేల్చడంతో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు పడి దాబాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

English summary
A stampede has been reported in the hill shrine of Tirupati and 5 people are believed to have been injured in the melee. TTD EO LV subrahmaniam was supervising and checking the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X