వైయస్ విజయమ్మ ప్రచారానికి జనం: బొత్స కామెంట్

జనాన్ని తరలిస్తే ఎవరికైనా వస్తారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయడమంటే అవినీతికి గేట్లు ఎత్తి వేయడమే అన్నారు. జగన్ గెలిస్తే ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని, కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దానిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
వైయస్ విజయమ్మ విమర్శలపై ఆయన మండిపడ్డారు. తమ ఆస్తులు కాపాడుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రాజీనామా చేశారన్నారు. కానీ రైతుల కోసమంటూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు మినహా ఏ పార్టీకి ఓటు వేసినా శూన్యమే అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను విస్మరించిందన్నారు.
బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఆయన కుందూరు నుండి రోడ్డు షో ప్రారంభించారు. అక్కడి నుంచి కోటిపల్లి, ఊడుమూడి, సత్యవాడ, పామర్రు, దంగేరు, బాలాంత్రం, అద్దంపల్లి గ్రామాలలో రోడ్డు షో నిర్వహిస్తారు. మరోవైపు వైయస్ విజయమ్మ కూడా ఈ రోజు ఇదే నియోజకవర్గంలో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications