వైయస్ మృతి: జగన్‌పై శంకరరావు సంచలన వ్యాఖ్యలు

అప్పట్లో ఏవియేన్ అధికారిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డిని ఆ స్థానంలో నియమిపజేసింది జగనేనని ఆరోపించారు. 2009కి ముందు కడప ఎంపిగా వైయస్ వివేకానంద రెడ్డిని తప్పించి ఆ టిక్కెట్ తనకు ఇవ్వాలని జగన్.. వైయస్ పైన ఒత్తిడి తెచ్చారన్నారు. అప్పట్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో వివేకానే కొనసాగారని అన్నారు.
దళితుడినైన తననూ, సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను కేబినెట్ నుంచి తొలగించడం కాదని.. కళంకిత మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. దేశంలోనే అతి పెద్ద స్కామ్‌ను ఛేదించిన సిబిఐకి రాష్ట్రపతి అవార్డును బహూకరించాల్సి ఉందన్నారు. వైయస్ మరణాన్ని విజయలక్ష్మి రాజకీయం చేయడం తగదన్నారు.
సొంత జిల్లా కడపలో 11 మంది చనిపోతే.. వారిని తక్షణమే ఎందుకు ఓదార్చలేదని జగన్‌ను ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విజయలక్ష్మి, ఆమె కూతురు షర్మిల విమర్శిస్తున్నా మహిళా మంత్రులు ఎదురుదాడి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళా మంత్రులతోపాటు 16 మంది మహిళా శాసనసభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలకు 18 శాసనసభా నియోజకవర్గాల ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించాలన్నారు. ఈనెల 18 తర్వాత సిఎం మారతారేమోనని మరోసారి సందేహం వెలిబుచ్చారు.












Click it and Unblock the Notifications