కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజంపేట: పాగా వేస్తానంటున్న అమర్నాథ్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Amarnath Reddy
కడప: వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గత మూడున్నర దశాబ్దాలుగా ఆధిపత్యం వహిస్తున్న కడప జిల్లాలో మూడు శానససభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో రాజంపేటకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణం ఇది. రాజంపేట లోకసభ స్థానానికి కాంగ్రెసు నాయకుడు సాయి ప్రతాప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహిత మిత్రుడు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కేంద్ర మంత్రి పదవిని కోల్పోయారు.

కాంగ్రెసు నాయకత్వంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నిజానికి ఆయన కాంగ్రెసు పార్టీని వదిలేసి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని భావించారు. కానీ కాంగ్రెసులోనే ఉండిపోయారు. రాజంపేట సీటు వైయస్ జగన్‌కు మద్దతు ఇచ్చిన ఎ. అమర్నాథ్ రెడ్డిపై అనర్హత వేటు పడడంతో ఖాళీ అయింది. ఆయన ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి 14 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

వైయస్ జగన్ అరెస్టుతో ప్రజల్లో పెరిగిన సానుభూతితో తనకు కలిసి వస్తుందని అమర్నాథ్ రెడ్డి భావిస్తున్నారు. అదే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో ప్రజలకు తనకు ఓటేస్తారని చెబుతున్నారు. అయితే, ఎట్టి పరిస్థితిలోనూ అమర్నాథ్ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పని చేస్తున్నాయి. కాంగ్రెసు ఎంవి మల్లికార్జన రెడ్డిని, తెలుగుదేశం పార్టీ పసుపులేటి బ్రహ్మయ్యను బరిలోకి దింపాయి. తెలుగుదేశం పార్టీ బిసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గంలో 1.86 లక్షల మంది ఓటర్లున్నారు.

బలిజ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండడంతో తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. పైగా, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి తమకు ప్రయోజనం కలుగుతుందని కూడా అనుకుంటోంది. పసుపులేటి బ్రహ్మయ్య గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అమర్నాథ్ రెడ్డి అంటున్నారు.

English summary
Kadapa district, the strong bastion of former chief minister YS Raja­sekhara Re­ddy’s family for the last three and half decades, will witness by-elections in three of its assembly constituencies this month. While the YSR Congress is expecting to romp in with a huge majority riding on the sympathy created after Jagan’s arrest, the Congress and TDP are leaving no stone unturned to ensure YSRC’s defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X