వైయస్ జగన్‌పై సిఎం వ్యాఖ్యకు ధర్మవరపు అసంతృప్తి

Dharmavarapu Subrahmaniam
ఒంగోలు/ ఏలూరు/ కడప: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 14 ఏళ్లు శిక్ష పడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, సినీ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఒంగోలులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు జగన్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. జగన్‌ను విమర్శించే ముందు కాంగ్రెసు నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు చంపిందనే అనుమానం కలుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. వైయస్ జగన్‌పై కుట్రలు చేస్తుంటే వైయస్ రాజశేఖర రెడ్డిపై కూడా కుట్ర జరిగిందనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేములదీవిలో ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెసు కుట్ర వల్లనే విజయమ్మ బయటకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఓటు ద్వారా జగన్‌కు మద్దతు పలకాలని ఆయన ప్రజలను కోరారు.

రాష్ట్రంలో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాయచోటి అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక పాలనకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని ఆయన గురువారం కడప జిల్లా రాయచోటిలో అన్నారు. వైయస్ జగన్ చేసిన తప్పేమిటో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలతో ఉండడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం జగన్ చేసిన తప్పా అని ఆయన అడిగారు. వైయస్ కుటుంబంపై విమర్శలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ వైయస్ కుటుంబాన్ని వీడేది లేదని ఆయన చెప్పారు. పదవుల కోసం చిరంజీవి పార్టీని అమ్ముకున్నారని ఆయన అన్నారు. విమర్శలు చేసేవారికి ఉప ఎన్నికల్లో దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+