మీ కోసమే చిరంజీవి వచ్చారు: బొత్స, జగన్‌పై నిప్పులు

Botsa Satyanarayana
ఏలూరు: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మీ కోసమే వచ్చారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. చిరంజీవితో కలిసి బొత్స నర్సాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించారని ఆరోపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల మాటలతో సానుభూతి రాదన్నారు. మీ కోసమే చిరంజీవి వచ్చారని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. మేమంతా ప్రజల కోసమే వచ్చామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసుకు వెన్నెముక లేదన్నారు. పార్టీ పూర్తి పేరు చెప్పుకోలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు ఉందన్నారు.

వైయస్ జగన్ పాపం పండింది కాబట్టే జైలుకు వెళ్లాడని చిరంజీవి అన్నారు. మీరంతా న్యాయం వైపు ఓటు వేయండని ప్రజలకు సూచించారు. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం శుభప్రదమని వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన తాజా మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం అభివృద్దిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెసు అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడిని గెలిపిస్తే అభివృద్ధిపై దృష్టి సారిస్తారని చెప్పారు.

జగన్ భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైయస్ జగన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అవినీతికి కవల పిల్లలు అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం తమ ఆస్తిని జాతికి అంకితమిస్తే, జగన్, గాలిలు మాత్రం జాతి సంపదను నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారన్నారు. వేలకోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+