విహారయాత్రకు వెళ్లి అమెరికాలో తెలుగువిద్యార్థి గల్లంతు

వర్జీనియా (అమెరికా)లోని అర్జీనియా వర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన శశాంక్ అక్కడే కాంట్రాక్ట్ పద్ధతిన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అతను తన తోటి స్నేహితులతో కలిసి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాన్ని చూడటానికి వెళ్లారు.
ఆ తర్వాత శశాంక్ మాయం కావడంతో స్నేహితులు అతని కోసం గాలించారు. ఫలితం లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశాంక్ పాస్‌పోర్ట్, ఐడీకార్డు, వాలెట్.. వారు వెళ్లిన కారులోనే ఉన్నాయి. అయితే, అతను జలపాతంలో పడిపోయాడని, అక్కడే ఉన్న ఒక సిసి కెమెరాలో అవి రికార్డయ్యాయని శశాంక్ రెడ్డి స్నేహితులు చెప్పడం గమనార్హం.
దీంతో అసలేం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శశాంక్ మే 31వ తారీఖున అదృశ్యమయ్యాడు. వర్సిటీ, పోలీసులు అధికారులు ఈ విషయమై ఏమీ చెప్పలేక పోతున్నారు, శశాంక్ కోసం వెతుకుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications