మేమే చేసుకున్నాం!: బైపోల్స్‌పై తలసాని, చిరుపై రోజా

Talasani Srinivas - Roja
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తమ పార్టీ చేసిన అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మలేదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం అన్నారు. ఓ ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలలో ఉండి ఏ ఒక్కరో అవినీతికి పాల్పడ్డారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ అవినీతిపై తమ వ్యాఖ్యలను ప్రజలు నమ్మలేదన్నారు. అవినీతిపై అబద్దపు ప్రచారమే మా కొంపముంచిందన్నారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ నాయకుడు బాగుండాలనేదే తన కోరిక అన్నారు. తాను పార్టీని వీడతానంటే ఎవరూ ఆపేది లేరన్నారు. కానీ తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని చెప్పారు. జగన్ పార్టీ గెలుపు సానుభూతి అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల ప్రచారంతో సానుభూతి లభించిందన్న వాదనతో తలసాని విభేదించారు. జగన్ ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకు పోవాలన్నారు. ఈ కేసులో జివోలు ఇచ్చిన వారిని వదిలి మిగిలిన వారిపై చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు. జగన్‌కు ఉప ఎన్నికలలో స్పష్టత వచ్చిన మాట నిజమే అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా మాట్లాడుతూ.. తిరుపతిలో కాంగ్రెసు ఓటమితో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రభావం ఏమిటో తెలిసిపోయిందన్నారు. రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల గెలుపుతో చిరంజీవికి సంబంధం లేదని, తిరుపతిలో కాంగ్రెసు విజయం సాధిస్తే ఆయన ప్రభావం ఉందని చెప్పేవాళ్లమన్నారు. ఆయన ఇమేజ్ పని చేయదని అర్థమైపోయిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+