అరెస్ట్ కన్నీళ్లు దెబ్బతీశాయి, మిగిలేదెవరో: చంద్రబాబు

జైల్లో ఉన్న జగన్ సిబిఐ కేసులు, ఈడి కేసులతో పీకల లోతున కూరుకుపోయి ఉన్నాడని, వాటిలో శిక్ష పడితే ఆ పార్టీ కథ ముగిసిపోయినట్లేనని అన్నారు. ఆయన బయటకొస్తే కాంగ్రెస్ ఫినిష్ అన్నారు. రాష్ట్రంలో రెండూ మనుగడ సాధించడం సాధ్యం కాకపోవచ్చునని, మన ప్రత్యర్థి ఎవరో తేలడానికి కొంత సమయం పడుతుందని, ఈలోపు మన పని మనం చేసుకుందామని ఆయన అన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణుల్లో కసిని.. ప్రజల్లో పార్టీ పట్ల ప్రేమను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. '1995 నాటి చీలిక పరిణామాల్లో పార్టీని కాపాడుకోవాలని పార్టీ శ్రేణులు, కిందిస్థాయి కార్యకర్తలు కసితో పనిచేశారు. దానివల్ల పార్టీ నిలబడింది. ఇప్పుడు ఆ కసి లేదు. ఇప్పుడు క్యాడర్‌లో ఆ కసిని పెంచాలి. దూరమైన వర్గాలను దరిచేర్చుకోవాలి. ప్రజలు మనను ఆదరించి హత్తుకొనేలా మనం పనిచేయాలి. ఈ రెండేళ్లకు ఇదే మన ప్రణాళిక' అన్నారు.
బిసిలలో పట్టు నిలుపుకోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పార్టీ వైఖరిలో స్పష్టత తేవాలని కడియం శ్రీహరి కోరారు. ఇలాంటి అంశాలపై ఒకో పొలిట్‌బ్యూరో సమావేశంలో ఒకోదాన్ని చర్చించి తేల్చేద్దామని చంద్రబాబు చెప్పారు. కాగా.. రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రధాని మన్మోహన్, చంద్రబాబుకు ఫోన్ చేశారు. సంగ్మా అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు, ఒడిసా సీఎంలు జయలలిత, నవీన్ పట్నాయక్ కూడా ఫోన్లు చేసినట్లు బాబు తెలిపారు. పార్టీ వైఖరిని ఖరారు చేయడానికి మరికొంత సమయం తీసుకోవాలని నిశ్చయించారు.












Click it and Unblock the Notifications