బాబుకు వర్కవుట్ కానీ సెంటిమెంట్ వైయస్ జగన్‌కు!

Chandrababu Naidu - YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విషయంలో సెంటిమెంట్ పని చేయనప్పటికీ.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కలిసొచ్చిందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గెలిచిన వారిలో దాదాపు అందరూ 2009లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువగానే సాధించారు.

అంతేకాకుండా బిజెపి వర్సెస్ టిఆర్ఎస్‌గా ఉంటుందని భావించిన పరకాల నియోజకవర్గంలో జగన్ పార్టీ నేత కొండా సురేఖ గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ సురేఖ చివరి రౌండ్లలో గెలుపు దిశగా వెళ్లి ఆఖరి నిమిషంలో స్వల్ప మెజార్టీతో ఓటమి చవి చూశారు. ఆఖరు రౌండ్లలో టిఆర్ఎస్‌కు జగన్ పార్టీ అభ్యర్థి ముచ్చెమటలు పట్టించారు. సీమాంధ్రలో గెలుపు అయినా, పరకాలలో తెలంగాణ సెంటిమెంట్ నెత్తిన పెట్టుకున్న టిఆర్ఎస్‌కు సురేఖ గట్టి పోటీ ఇవ్వడమైనా అంతా జగన్ క్రెడిట్ అంటున్నారు.

ప్రజల నుండి సానుభూతిని పొందడంలో జగన్ సఫలీకృతుడయ్యాడని అంటున్నారు. జగన్ అరెస్టు ప్రజలలో వైయస్సార్ కాంగ్రెసు పైన సానుభూతి కురిపించేట్లుగా చేసింది. అతని అరెస్టు తర్వాత ప్రచార బరిలోకి దిగిన పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిలలు కూడా తమ మాటల ద్వారా ప్రజల సానుభూతిని పొందగలిగారు. వైయస్‌పై ఉన్న అభిమానంతో పాటు జగన్ అరెస్టు, విజయమ్మ, షర్మిలల ప్రచారంపై ప్రజల నుండి సానుభూతి వెల్లువెత్తిందని, అందుకే పార్టీ ఘన విజయం సాధించిందని అంటున్నారు.

అయితే జగన్ విషయంలో వర్కవుట్ అయిన సానుభూతి చంద్రబాబు విషయంలో మాత్రం పని చేయలేదని అంటున్నారు. 2004 చంద్రబాబు తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆరు నెలల ముందే ఎన్నికలకు సై అన్నారు. ఆ సమయంలో తిరుపతిలో నక్సలైట్లు చంద్రబాబు టార్గెట్‌గా బాంబు పెట్టారు. నక్సలైట్లు బాంబు పేల్చడంతో చంద్రబాబు కారు తునాతునకలు అయింది. అయితే ఈ ప్రమాదం నుండి బాబు గాయాలతో బయటపడ్డారు.

దీంతో తనపై నక్సలైట్ల దాడిని సాకుగా చూపి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాడు. మరో ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయనపై సానుభూతి కురిపించలేక పోయారు. ఆ ఎన్నికలలో కాంగ్రెసు విజయ ఢంకా మోగించింది. టిడిపి ఘోర పరాజయం చవి చూసింది. సానుభూతితో మళ్లీ గెలుద్దామనుకున్న బాబుకు అప్పుడు చుక్కెదురు కాగా తాజాగా జగన్‌కు మాత్రం వర్కవుట్ కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+