ఫలితాలపై శంకరన్న ఎద్దేవా, తేడాలేకుండా... రాయపాటి

Shankar Rao
హైదరాబాద్/గుంటూరు: ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు మహాత్మా గాంధీకి గాడ్సేకు తేడా లేకుండా ఇచ్చినట్లు ఉందని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో ప్రజల తీర్పు ఇలాగే ఉందన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదన్నారు.

అవసరానికి పనులు చేయించుకుంటున్న అనేక మంది పార్టీ నాయకులే.. వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారంలో జగన్ అవినీతి గురించి ప్రస్తావిస్తే.. అవినీతికి పాల్పడిన మీ మంత్రులను పక్కన పెట్టుకొని ప్రచారానికి వస్తే ఎలా ఓట్లు వేస్తామని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడిన మంత్రులు ప్రచారం చేస్తే ప్రజలు ఎలా గెలిపిస్తారన్నారు. వారిని పక్కన పెడితే.. పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అభివృద్ధి, మంచి, చెడులపై ప్రజలు ఆలోచించడం లేదన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కొంపముంచిందని విజయవాడ ర్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన అరెస్టు కాకుండా ఉన్నట్లయితే జగన్ పార్టీ తొమ్మిది సీట్లకే పరిమితమయ్యేదని చెప్పారు. అలాగే మే 27కి ముందు తాను చెప్పినట్లుగా కాంగ్రెస్ ఎనిమిది చోట్ల విజయం సాధించేదన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించారు. జగన్ కుట్ర ప్రకారం అరెస్టు అయ్యారని, పథకం ప్రకారమే సిబిఐ విచారణ సమయంలో మ్యాటిక్స్ ప్రసాద్‌పై దౌర్జన్యం చేసి అరెస్టు చేయక తప్పని పరిస్థితి కల్పించారన్నారు.

ఆ వెంటనే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రచార బాధ్యతల స్వీకరించటం, ప్రచారంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవటం వంటి పరిణామాలతో సానుభూతి పవనాలు వీచాయన్నారు. కాంగ్రెస్ పథకాలను వైయస్‌వి అని చెప్పుకొని జగన్ పార్టీ లాభపడిందని చెప్పారు. భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ విజయమ్మ ప్రచారం చేయటం కూడా ఆ పార్టీకి బాగా కలిసి వచ్చిందన్నారు. అయితే ఈ గెలుపు పాలపొంగు వంటిదని, అది ఎంతోకాలం ఉండదని వ్యాఖ్యానించారు.

అయితే, కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల సామాజికవర్గానికి చెందిన వారినే టిడిపి పోటీలో నిలపడంతో కొంత నష్టం జరిగిందన్నారు. కాగా, పరకాలలో విజయమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం ఆ పార్టీకి ఓటింగ్ పెంచిందని విశ్లేషించారు. తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపితో ఆమె పార్టీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. దానివల్ల తనను అనుమతించని ఆయా పార్టీలు.. ఆమెను ఎక్కడా అడ్డుకోలేదని చెప్పారు. ఉప ఎన్నికలలో సమైక్యవాదానికే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. తాజా ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని లగడపాటి స్పష్టం చేశారు.

ఉప ఎన్నికలలో 18 మందిని గెలిపిస్తానని జగన్ హామీ ఇచ్చినా, ముగ్గురు ఓడిపోయారని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా ఇకపై ఎవరూ రాజీనామా చేసే ధైర్యం చేయలేరన్నారు. బహుశా ఆగస్టులో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. వైయస్ హయాంలో చేపట్టిన భూ సేకరణలో రైతులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. రూ.800 కోట్ల విలువైన వాన్‌పిక్ భూములను మ్యాట్రిక్ ప్రసాద్‌కు వైఎస్ కట్టబెట్టారన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఉప ఎన్నికల్లో చాలా మెరుగైన ఫలితాలు వచ్చాయని.. ఇలాంటి ఫలితాలు చరిత్రలో ఎప్పుడూ రావని మాజీ మంత్రి శంకర రావు ఎద్దేవా హైదరాబాదులో చేశారు. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచిందని, ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+