అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య, రైళ్లలో చోరీ

మరోవైపు కడప జిల్లాలో ఓ భర్త తన భార్య, తన రెండేళ్ల చిన్నారని చంపివేశాడు. జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ఉదయం తన భార్యను, రెండేళ్ల చిన్నారని హత్య చేసి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే ఇలా జరిగినట్లు తెలస్తోంది.
కాగా ఖమ్మం జిల్లాలోని పావటపల్లి వద్ద రెండు రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ - విశాఖపట్నం ప్రత్యేక రైలును పావటపల్లి వద్ద దుండగులు చైన్ లాగి ఆపివేశారు. ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4, ఎస్ 8, ఎస్ 9 బోగీలలో ప్రయాణీకుల నుండి ఆరు కాసుల బంగారాన్ని దోచుకు వెళ్లారు.
మరోవైపు విజయవాడ - కాజీపేట పుష్‌పుల్ రైలులో కూడా మరికొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా గార్ల మండలం గోపాలపురానికి చెందిన సుజాత అనే ప్రయాణీకురాలు మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. కిటికీ పక్కన కూర్చున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications