తెరాసకు పరకాల ఫలితం చెంపపెట్టు: ఎర్రబెల్లి వ్యాఖ్య

కేంద్ర ప్రభుత్వం నాటకాలు మాని తెలంగాణ అంశంపై స్పష్టతతో ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఒక్కో పార్టీ నుంచి ఒక్కరినే పిలవాలని, అప్పుడే పరిష్కారం వస్తుందని ఆయన సూచించారు. సీమాంధ్రకు చెందిన తమ పార్టీ నేతలతో కూడా మాట్లాడి ఏకాభిప్రాయానికి కృషి చేస్తామని, త్వరలో జరగనున్న మహానాడు నాటికి ఈ కసరత్తును పూర్తి చేసి మరింత స్పష్టత ఇస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో తమ పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన తేల్చిచెప్పారు.
పరకాల ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతంపై ఫోరం సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడ కొంత కృషి లోపం ఉందని, సమష్టిగా మరి కొంత శ్రమ పడి ఉంటే మరింత పెద్ద సంఖ్యలో ఓట్లు సాధించగలిగి ఉండేవారమని కొందరు నేతలు అన్నారు. తెలంగాణలో పార్టీ ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి గట్టి ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ నష్టపోవడంపై చర్చ జరిగింది.
ఇది పార్టీకి గడ్డు కాలమని, పార్టీ పూర్వ వైభవం సాధించడానికి అధినాయకత్వానికి సహకరించాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, కడియం శ్రీహరి, మండవ వెంకటేశ్వరరావు, ఏలేటి అన్నపూర్ణమ్మ, ఉమా మాధవరెడ్డి, సీతక్క, సీతా దయాకరరెడ్డి, కొత్తకోట దయాకరరెడ్డి, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం, పి. రాములు, ప్రకాశ్ గౌడ్, జి.నగేష్, విజయ రమణారావు, గంగుల కమలాకర్, అరిగెల నర్సారెడ్డి, గంగాధర్ గౌడ్, సంకినేని వెంకటేశ్వరరావు, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications