హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాల మాటలపైనే మాకు అనుమానం: శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth Reddy
హైదరాబాద్: చంద్రబాల, సిబిఐ జాయిట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణ మధ్య సంబంధం తమకు అవసరం లేదని, కానీ చంద్రబాలతో తమ పార్టీ వ్యతిరేకులు మాట్లాడడం చూస్తుంటే విచారణ తీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు అని ఆయన ధర్నా చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడంపై అన్నారు.

తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని ఆయన అన్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే పోలీసులు తమను అగౌరవరపరిచారని ఆయన అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే తమపై జులుం ప్రదర్శించడం ఎంత వరకు న్యాయమని ఆయన అడిగారు. పోలీసుల తీరు చూస్తే నియంతల పాలనలో ఉన్నామా అనిపించిందని ఆయన అన్నారు.

ప్రజాదరణ ఉన్న తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. చంద్రబాలతో తమ పార్టీ వ్యతిరేకులు మాట్లాడడడవిచారణ తీరుపై అనుమాం కలుగుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ విడుదల చేసిన కాల్ లిస్టుకు సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, త్వరలోనే బయటపెడతామని ఆయన అన్నారు.

మీడియా ప్రతినిధులతో జెడి మాట్లాడడాన్ని తాము పట్టడం లేదని, యాజమాన్యాలతో మాట్లాడడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు. ఐపియస్ ధికారి జెవి రాముడుతో చంద్రబాల మాట్లాడినట్లు స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీటీిని బట్టి చంద్రబాలతో తమ వ్యతిరేకులకు సంబంధాలు ఉన్నట్లు రుజువైందని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సుప్రీంకోర్టు కన్నా జెడి గొప్పవాడా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. సిబిఐ జెడి పలు మీడియా ప్రతినిధులతో గంటల తరబడి మాట్లాడడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. జెడి లక్ష్మినారాయణ ఒక ఉద్యోగి మాత్రమేనని, ఇంత మందికి ఫోన్లు చేసే అధికారం జెడికి ఎవరిచ్చారని ఆయన అన్నారు. హైకోర్టును కూడా మోసం చేసే విధంగా సంభాషించాడని, యుపిఎస్సి మాన్యువల్ జెడి చదువుకోవాలని ఆయన అన్నారు.

English summary

 YSR Congress party MLA srikanth Reddy said that the woman Chandrabala talking to their opponants is raising suspecious attitude. He said that he is no way concerned the relation between Chandrabala and CBI JD Laxminarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X