హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తిపై హైదరాబాదులో కాల్పులు: నాలాలో వ్యక్తి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీలో కాల్పుల సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాదులోని పాతబస్తీలో గల ఫలక్‌నుమా ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఇద్దరు దండగులు బైక్ వచ్చి కాల్పులు జరిపి పారిపోయినట్లు సమాచారం. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

కాల్పుల్లో గాయపడిన వ్యక్తిని తొలుత ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత యశోదా ఆస్పత్రికి మార్చారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాతకక్షల కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత తగాదాల వల్లనే ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి ఉండవచ్చునని భావిస్తున్నారు.

సికింద్రాబాద్‌లో విషాదం నెలకొంది. డ్రైనేజ్ క్లీన్ చేస్తుండగా ఓ కూలీ గల్లంతయ్యాడు. వర్షాలు పడటంతో గురువారం ఉదయం సికింద్రాబాదులోని బాటా చౌరస్తా వద్ద నాలాలోని వ్యర్థపదార్ధాలను, చెత్తను తొలగించడానికి ఐదుగురు కూలీలు అందులోకి దిగారు. కాగా ఒక్కసారిగా వరద ఉదృతి అధికంగా అవడంతో నలుగురు కూలీలు అతికష్టం మీద బయటకు వచ్చారు.

అయితే దేవరాజు అనే కూలీ నాలలో కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని తగు చర్యలు చేపట్టారు. అయితే, దేవరాజు మృతి చెందాడు. అనుభవం లేని పనివాళ్లను నియోగించడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని అంటున్నారు. హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దేవరాజ్ మృతదేహం బయటపడింది.

English summary

 Unidentified persons shot at a person, travelling in an auto. The incident occured at Falaknuma of Hyderabad old city. The accused came on a bike, fired at the person abd fled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X