వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

Massive fire breaks out at Mumbai secretariat office
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై సచివాలయంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పడానికి 25 ఫైర్ టెండర్స్, 3 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు మహారాష్ట్ర సహాయ మంత్రి, ఎన్సీపి నాయకుడు బాబన్ రావు పచుపుటే కేబిన్ నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

నాలుగో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది బయటకు పరుగులు పెడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎవరూ మరణించలేదని తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచన మేరకు భవనాన్ని ఖాళీ చేయించారు. మంత్రాలయ విభాగంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మంటలు ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి పాకుతున్నట్లు భయాందోళనలు చోటు చేసుకున్నాయి. ఆరో అంతస్తులో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సిబ్బంది ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెంటనే ఫైర్ టెండర్లు చేరుకోవడంతో ప్రమాద నష్టం ఎక్కువగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. ఫైరింజన్ల రాకకు ఆటంకం లేకుండా ట్రాఫిక్‌ను పౌరులు కూడా స్వచ్ఛందంగా నియంత్రిస్తున్నారు.

English summary
Massive fire broke out at the Mumbai secretariat office on Thursday, said fire brigade sources. 25 fire tenders and 3 ambulances have been rushed to the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X