ముంబై దాడుల కేసు: ఉగ్రవాది జబీయుద్దీన్ అరెస్టు

గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన 30 ఏళ్ల అన్సారీ అలియాస్ అబూ జిందాల్ ఈ నెల 21వ తేదీన అరెస్టు చేశారు. ఇతను మహారాష్ట్రలోని బీడ్ జిల్లా గెయోరీ ప్రాంతానికి చెందినవాడు. ఇతన్ని అరెస్టు చేసిన విషయాన్ని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. అతని కోసం భారత్ ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.
అతని అరెస్టు సందర్భంగా పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, వారిని దాడులకు పురికొల్పిన పాకిస్తాన్ వ్యక్తులకు మధ్య జరిగిన సంభాషణల్లో విచిత్రమైన గొంతకు సంబంధించిన సమాచారం బయటపడింది. 26/11 దాడుల సందర్భంగా హంజా పాకిస్తాన్‌లో ఉన్నట్లు సమాచారం. హంజా దాడులకు లక్ష్యాలను గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో గుజరాత్‌కు సంబంధించిన కేసుల్లో కూడా అతని అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడ్ని కోర్టు 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. అతని అరెస్టుతో పది మంది ఉగ్రవాదలతో సంభాషణలు జరిపిన అదృశ్య వ్యక్తి సంభాషణల గుట్టు బయటపడింది. టేప్‌లో ప్రహసన్ (ప్రభుత్వం) వంటి ప్రత్యేకమైన పదజాలాన్ని వాడాడు. ఉగ్రవాదులు తమ గుర్తింపును చెప్పకూడదని, తాము హైదరాబాదులోని టోలీచౌక్‌కు చెందిన దక్కన్ ముజాహిదీన్‌గా చెప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications