రెండు ఊళ్ల మధ్య నీటి యుద్ధం, తీవ్ర ఉద్రిక్తత

ఘటనాస్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల పరువు ప్రతిష్టల సమస్యగా ముందుకు వచ్చి ఇరు గ్రామాల ప్రజల ఘర్షణకు దిగారు. ఓ పంట కాలువ విషయంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ పంట కాలువ తమదంటే తమదని ఇరు గ్రామాల మధ్య చాలా కాలం క్రితమే వివాదం చోటు చేసుకుంది. దీంతో పురుటిపెంట గ్రామ ప్రజలు కోర్టుకు ఎక్కారు.
ఆ కాలువ పురుటిపెంటకు చెందిందని కోర్టు తీర్పు ఇస్తూ దాన్ని ఆ గ్రామానికి పోలీసుల రక్షణతో అప్పగించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో ఆ కాలువను అధికారులు పురుటిపెంట గ్రామానికి అప్పగించారు. అయితే, ఇప్పుడు తాజాగా ఆ వివాదం ముందుకు వచ్చింది. శుక్రవారం రాత్రి ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు జెసిబి సాయంతో కాలువను మళ్లించే ప్రయత్నం చేశారు.
ఆ గ్రామ ప్రజలను అడ్డుకోవడానికి మరో గ్రామానికి చెందిన ప్రజలు ముందుకు వచ్చారు. ఇది తెలుసుకున్న గంగచోళ్లపెంట ప్రజలు ఆయుధాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పురుటిపెంట గ్రామ ప్రజలు కూడా అదే విధంగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమస్యను పరిష్కరించడానికి ఇరు గ్రామాల ప్రజలతో ఆర్డివో, డిఎస్పీ చర్చలు జరుపుతున్నారు.
కోర్టు తీర్పు మేరకు ఆ కాలువ తమదేనని, తమకే అప్పగించాలని పురుటిపెంట గ్రామప్రజలు కోరుతుండగా, తమ పొలాలకు నీరు కావాలని, అందువల్ల ఆ కాలువ నీటిని తమకు వదలాలని గంగచోళ్లపెంట గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications