మేం కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టం: వైయస్ విజయమ్మ

రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె అన్నారు. రైతులకు కావాల్సినంత ఎరువులు దొరకడం లేదన్నారు. తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకం కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు పర్చడం లేదన్నారు. పాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ముందు చూపు లేదని ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి సమస్యలపై ముందే ప్లాన్ చేసుకునే వారన్నారు. విత్తనాలు, విద్యుత్ ఎలాంటి సమస్యనైనా రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకునే వారన్నారు. అందుకే ఆయన రైతుల విశ్వాసం చూరగొన్నారన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి ప్రణాళిక లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రైతుల కోసమంటూ అవిశ్వాసం పెడితేనే తమ పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. రైతుల కోసమే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. మా విజ్ఞప్తులు విన్న నేతలకు కృతజ్ఞతలు అన్నారు.
తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపుతో సిబిఐ దర్యాఫ్తు చేస్తోందని ఆమె అన్నారు. రైతుల అంశంతో పాటు ఢిల్లీ పెద్దల దృష్టికి తన తనయుడుపై జరుగుతున్న కుట్రను కూడా వివరించానని తెలిపారు. తృణమూల్ కాంగ్రెసు, జెడి(యు) తదితర పార్టీలను కలిసినట్లు చెప్పారు. కాగా విజయమ్మ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications