వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి సంతకం చేస్తా: బోనాలపై బాబు, తలసానితో కలిసి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Talasani Srinivas Yadav
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి, పార్టీ అసంతృప్త నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. చంద్రబాబు, తలసాని ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శించుకున్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... మహంకాళీ అమ్మవారి బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాను తొలి సంతకం ఇదే ఫైలు పైన పెడతానని చెప్పారు. రెండువందల ఏళ్లుగా జరుపుకుంటున్న ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించక పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని తాము తొలి నుండి డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బిజెపి రాష్ట్ర పండుగగా ప్రకటిస్తుందని చెప్పారు.

పెద్దపల్లి శాసనసభ్యుడు వివేక్ కుటుంబ సభ్యులతో సహా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో పెద్ద పండుగ అయిన ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలన్నారు. మంత్రి గీతా రెడ్డి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, హైదరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బండ కార్తిక రెడ్డి తదితరులు దర్సించుకున్నారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu offered prayers at Secunderabad Mahankali Ammavaru on Sunday morning along with former minister Talasani Srinivas Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X