వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాలకు నో చెప్తున్నా, హైట్‌కి తగ్గట్టు..: గుత్తా జ్వాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gutta Jwala
హైదరాబాద్: తాను ప్రస్తుతం సినిమాలకు నో చెప్తున్నానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆదివారం అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో ఓ బ్యూటీ సెలూన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు తెలుగు సినిమాలలో అవకాశాలు వస్తున్నా అంగీకరించడం లేదని చెప్పారు. అయినా తన హైట్‌కు తగ్గ హీరో దొరికినప్పుడు ఆలోచిస్తానని చెప్పారు. ఇప్పటి వరకైతే ఏ సినిమాలు అంగీకరించలేదని చెప్పారు.

ఒలంపిక్స్ తర్వాతే ఏదైనా ఆలోచిస్తానని చెప్పారు. అధునిక యుగంలో అందానికి ప్రాధాన్యత పెరిగిందని, అయితే తనకు దానిపై ఆసక్తి లేదని చెప్పారు. టాలీవుడ్‌లో తనకు నచ్చిన హీరోలు చాలామంది ఉన్నారన్నారు. తాజాగా ఫోటోషూట్‌లో పాల్గొన్న విషయమై అడిగితే.. మోడలింగ్ పైన తనకు ఆసక్తి ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆ రంగంలోకి వెళ్లే ఆలోచన తనకు లేదని చెప్పుకొచ్చారు. రాబోయే ఒలింపిక్స్ 2012కు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నానని తెలిపారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాలలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు.

కాగా ఇటీవల ఒలింపిక్స్‌కు ఎంపిక విషయంలో లియాండర్ పేస్, మహేష్ భూపతి మధ్య గొడవ, ఐటా నిర్ణయంపై సానియా మీర్జా మండిపడటం తెలిసిన విషయమే. దీనిపై అప్పుడు జ్వాల స్పందించారు. ఒలింపిక్స్‌లో ఆడే విషయంలో ఐటా ముందుగానే టెన్నిస్ క్రీడాకారులతో మాట్లాడి ఉండాల్సిందని జ్వాలా అప్పుడు అభిప్రాయపడ్డారు. ముందుగానే సానియా మీర్జాతో మాట్లాడి ఉంటే గొడవ అయి ఉండేది కాదని ఆమె అన్నారు. మిక్స్‌డ్ డబుల్స్ జట్టును ఖరారు చేసే ముందు సానియాతో మాట్లాడి ఉండాల్సిందని ఆమె అన్నారు. ఒలింపిక్స్‌కు తాము పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నామని ఆమె అన్నారు.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తర్వాత గోపిచంద్ అకాడమీలోనూ శిక్షణ పొందుతానని ఆమె చెప్పారు. క్రీడల్లో పురుషాధిక్యం కొనసాగుతోందని ఆమె విమర్శించారు. తాము ప్రోత్సాహక బహుమతులకు పనికి రామా అని ఆమె అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆమె అన్నారు. ప్రపంచ కప్ గెలవడం కన్నా ఇంకేం కావాలని ఆమె అడిగారు. సానియా మీర్జాకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని ఆమె తెలిపారు. టెన్నిస్ జట్టు ఎంపిక విషయంలో సానియా చేసిన వ్యాఖ్యలు సరైనవేనని ఆమె అన్నారు.

వుమెన్ డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాలా గుత్తా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఫిట్నెస్ తన విషయంలో అత్యంత ప్రధానమైందని, తాను తీవ్రంగా శ్రమిస్తున్నానని గుత్తా జ్వాలా చెప్పారు. తాను అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉంటానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉదయమూ సాయంత్రమూ, కోర్టు వెలుపల కూడా బ్యాడ్మింటన్ గురించే ఆలోచిస్తే అనవసరమైన ఒత్తిడి పెరుగుతుందని ఆమె అన్నారు.

అంత పెద్ద ఈవెంట్ ఉన్న సమయంలో కాస్తా రిలాక్స్‌గా ఉండి, ఎంజాయ్ చేయాలని, అట్లని శ్రమించకూడదని తన ఉద్దేశ కాదని, తీవ్రంగా శ్రమిస్తూ రిలాక్స్ కావాలని ఆమె అన్నారు. రెండు ముఖ్యమేనని ఆమె అన్నారు. గగన్ నారంగ్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాడని ఆమె అన్నారు. మహేష్ భూపతి, లియాండర్ పేస్ వివాదంపై మాట్లాడడానికి ఆమె నిరాకరించారు. అది వారి వ్యక్తిగత విషయమని, తాను మాట్లాడదలుచుకోలేదని, వారు సమస్యను పరిష్కరించుకుంటే దేశానికి మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.

English summary
India's ace Shuttler Gutta Jwala on Sunday said that she was focusing on her fitness ahead of the London Olympics. She said she was refusing cinema offers. "Right now I am focusing lot on my fitness because I will be playing two events," said Jwala, who will be playing the women's doubles and mixed doubles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X