విజయ్ మార్క్ గవర్నెన్స్- 32 మంది ఐఎఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ ఫర్: నూతన కలెక్టర్లు

ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలను చేపట్టింది. ఒకే విడతలో మొత్తం 32 మంది ఐఎఎస్ లను బదిలీ చేసింది. దీంతో దాదాపు అన్ని విభాగాలకు కూడా నూతన అధిపతులు, ముఖ్య కార్యదర్శులు నియమితులు అయ్యారు. కొన్ని జిల్లాలకు నూతన కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

కళాశాల విద్య కమిషనర్ సుందరవల్లి.. పబ్లిక్, పునరావాస శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ లలిత ఆర్థిక శాఖలో ప్రభుత్వ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. తెన్ కాశి, కాళ్ళకురిచి జిల్లా కలెక్టర్లు ఏకే కమల్ కిషోర్, ఎంఎస్ ప్రశాంత్‌ ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శులుగా బదిలీ అయ్యారు. కన్యాకుమారి జిల్లా కలెక్టర్ ఆర్ అలగుమీనా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.

Tamil Nadu government led CM Vijay reshuffles 32 IAS officers Tirunelveli and Tenkasi new collectors

తమిళనాడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా కులకర్ణిని నిషేధం, ఎక్సైజ్ కమిషనర్‌గా నియమించారు. వీ అముదవల్లి గ్రామీణాభివృద్ధి కమిషనర్‌, పీ పొన్నయ్య కళాశాల విద్య కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ టీజీ వినయ్.. హిందూ మత, ధార్మిక సంస్థల కమిషనర్‌గా పోస్టింగ్ పొందారు. ఆర్ కన్నన్ చక్కెర శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన తమిళనాడు వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలు కొనసాగించనున్నారు.

జిల్లా స్థాయి బదిలీలలో తంజావూరు కలెక్టర్ బీ ప్రియాంక పట్టణ పంచాయతీల డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. నాగపట్నం కలెక్టర్ పీ ఆకాష్‌ను మదురై జిల్లా కలెక్టర్‌గా, కేజే ప్రవీణ్ కుమార్ కొత్త నాగపట్నం జిల్లా కలెక్టర్‌గా, డాక్టర్ ఆర్. వైద్యనాథన్.. తేని జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. వీ శరవణన్‌ను తిరుచిరాపల్లి నుండి ధర్మపురి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయగా, ప్రతీక్ తాయల్ తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన వందనా గార్గ్‌కు తిరువన్నామలై జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.

జేఈ. పద్మజ కాళ్ళకురిచి జిల్లా కలెక్టర్‌గా, ఎన్ ప్రియ రాణిపేట్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఎల్ మధుబాలన్ నామక్కల్ జిల్లా కలెక్టర్‌గా, ఆనంద్ మోహన్ తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. పీఎస్ లీలా అలెక్స్ వేలూరు జిల్లా కలెక్టర్‌గా, ఆర్ రేవతిని తంజావూరు జిల్లా కలెక్టర్‌గా, డాక్టర్ ఎం వీరప్పన్‌ను చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. కె తర్పగరాజ్‌కు సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ లభించింది.

ఆర్. సతీష్ ప్రవాస తమిళుల పునరావాసం, సంక్షేమ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇతర ముఖ్య నియామకాలలో భాగంగా, మంగాట్ రామ్ శర్మ తమిళనాడు పవర్ ఫిన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (POWERFIN) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జే జయకాంతన్‌ను పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఇ. శరవణవేల్‌రాజ్‌కు మినరల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, పీఎన్ శ్రీధర్‌కు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

ఎస్ పీ కార్తికా చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు. ఆర్వీ షాజీవన తమిళనాడు టెక్స్ట్ బుక్, విద్యా సేవల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, రామనాథపురం జిల్లా కలెక్టర్ సిమ్రాన్‌జీత్ సింగ్ కహ్లోన్‌ను చెన్నై నదుల పునరుద్ధరణ ట్రస్ట్ మెంబర్ సెక్రటరీగా నియమించారు.

బి. గణేశన్‌ను న్యూ తిరుపూర్ ఏరియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. రంజీత్ సింగ్‌కు తమిళనాడు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పోస్టింగ్ లభించగా, వి.ఆర్. సుబ్బులక్ష్మి తమిళనాడు రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+