పాక్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్!

పాకిస్థాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలోని ఉంచుకుని ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి రెండు రోజుల్లోగా తరలించి ఆయన వ్యక్తిగత వైద్యుడికి సేవలు అందించేందుకు అవకాశమివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా లండన్‌లో నివసిస్తున్న ఆయన ఇద్దరు కొడుకులతో వారానికి రెండుసార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకునేందుకు సదుపాయం కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది.

విషమించిన మాజీ ప్రధాని ఆరోగ్యం.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
విషమించిన మాజీ ప్రధాని ఆరోగ్యం.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

కోర్టు తీర్పును సవాలు చేయనున్న పాక్ సర్కారు
సుప్రీంకోర్టు ఉత్తర్వులపై పాక్ ప్రభుత్వం తీవ్ర విముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పాక్ న్యాయ శాఖ మంత్రి ఆజం నజీర్ తరార్ వెల్లడించారు. ఈ ఉత్తర్వు చట్ట పరిధికి లోబడి లేదని ఆయన పేర్కొన్నారు. చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు జైలు ప్రాంగణంలో లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందించడానికి నిబంధనలు అనుమతిస్తాయని.. అందుకే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలన్న ఆదేశాన్ని మార్చాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Imran Khan Health Update Pakistan Supreme Court Orders Transfer to Private Hospital Govt to Challenge

స్పందించిన ఇమ్రాన్‌ఖాన్ కుమారుడు, పీటీఐ పార్టీ
సుప్రీంకోర్టు తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్(పీటీఐ) స్వాగతించింది. ఆ ఆదేశాలను తక్షణమే పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. లండన్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిమ్ స్పందిస్తూ.. తన తండ్రి ఆరోగ్యం మాత్రమే తమకు అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పాటించి వారితో మాట్లాడేందుకు అలాగే పాకిస్తాన్ వచ్చి తండ్రిని పరామర్శించేందుకు వీసా జారీ చేస్తుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

లంకేయులపై టీమిండియా జైత్రయాత్ర: ఆశలు సజీవం: క్రెడిట్ ఆ ఇద్దరికే
లంకేయులపై టీమిండియా జైత్రయాత్ర: ఆశలు సజీవం: క్రెడిట్ ఆ ఇద్దరికే

గతేడాది కాలంగా జైలులోనే ఇమ్రాన్ ఖాన్
73 ఏళ్ల క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి రావల్పిండిలోని జైలులో ఉన్నారు. ఆర్మీతో విభేదాలు, 2022లో ప్రధాని పదవి నుంచి తొలగింపు తర్వాత ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా కేసులు రాజకీయ కుట్రతో కూడుకున్నవని ఆయన ఆరోపించారు. గత కొన్ని నెలలుగా జైలులోనే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, తగిన వైద్య సదుపాయాలు అందించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+