కవితతో CM విజయ్ ఆస్ట్రాలజర్ భేటీ - మారుతున్న లెక్కలు..!!
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. గెలుపు పైన ఇప్పటి నుంచే ధీమాతో ఉన్నాయి. కాగా.. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల పైన ఫోకస్ చేస్తున్నాయి. అందులో కేసీఆర్ తన కవిత తన కొత్త పార్టీ ద్వారా పోటీకి సమాయత్తం అవుతున్నారు. ఈ సమయంలోనే తమిళనాడులో సంచలన విజయం నమోదు చేసిన విజయ్ ఆస్ట్రాలజర్ ఇప్పుడు కవితతో భేటీ కావటం రాజకీయంగా కొత్త చర్చకు కారణం అవుతోంది.
తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం కొత్త నినాదాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. తాజాగా తమిళనాడులో విజయ్ సీఎం కావటం వెనుక కీలక పాత్ర పోషించారనే పేరు ఉన్న ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ తాజాగా కవితతో సమావేశం అయ్యారు. ఆయన తన విజయం వెనుక చేసిన సూచనలు.. నిర్ణయాలకు ప్రతిఫలంగా విజయ్ తన కార్యాలయంలో ఓఎస్డీ పోస్టు కట్టబెట్టారు. ఈ నిర్ణయం పైన మిత్రపక్షాలతో సహా అందరి నుంచి విమర్శలు రావటంతో.. వెనక్కు తగ్గారు. విజయ్ సీఎం అయిన తరువాత రికీ రాధన్ పండిట్ కు డిమాండ్ పెరిగింది. ఇతర పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. అందులో భాగంగా కవిత తో భేటీ అయినట్లు తెలుస్తోంది. కవిత ఆహ్వానం మేరకు ఆయన వచ్చారని చెబుతున్నారు.

రాజకీయంగా కొత్త చర్చ మొదలు
రాజకీయంగా ఎదగాలనే పట్టుదలతో ఉన్న కవిత.. తన రాజకీయ భవిష్యత్.. జాతకం గురించి రికీ రాధన్ పండిట్ తో చర్చించారని తెలుస్తోంది. అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం లోనే రాష్ట్రంలో 150కి పైగా సీట్లు గెలుచుకుని విజయ్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో తమిళనాడు దేవాలయాలు ప్రపంచ స్థాయిని అందుకుంటాయని రాధన్ జోస్యం చెప్పారు. ఆ తరువాత అందరి అంచనాలకు భిన్నంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసారు. కాగా. ఇప్పుడు తెలంగాణలో కవిత సైతం భారీ ఆశతో వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. దీంతో.. రికీ రాధన్ పండిట్ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఆధ్మాత్మికతకు కవిత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇదే సమయంలో జాతకాల పరంగానూ తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన రికీ రాధన్ పండిట్ తో చర్చించి ఉంటారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ భేటీ పైన రాజకీయంగా కొత్త చర్చ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications