Vaibhav Suryavanshi: 10 ఏళ్ల డేవిడ్ వార్నర్ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే బాద్‌షా

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క పేరు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.. అతడే 15 ఏళ్ల బీహార్ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ! వయసు కేవలం పదిహేనేళ్లే అయినా, క్రీజులోకి వస్తే మాత్రం దిగ్గజ బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన 'క్వాలిఫైయర్ 2' మ్యాచ్‌లో ఈ యువ కెరటం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఐకాన్లుగా నిలిచిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ వంటి గ్లోబల్ స్టార్ల రికార్డులను తుడిచిపెట్టేస్తూ.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త 'పవర్‌ప్లే కింగ్'గా అవతరించాడు.

డేవిడ్ వార్నర్ 10 ఏళ్ల రికార్డ్ బద్దల్.. ఫస్ట్ టైమ్ ఇన్ ఐపీఎల్!

మొదటి 6 ఓవర్ల పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఉతికి ఆరేయడంలో ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట 2016 నుండి ఉన్న ఆల్-టైమ్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో ఏకంగా 521 పరుగులు సాధించి, ఒకే సీజన్ పవర్‌ప్లేలో 500 పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. నాడు వార్నర్ 150.16 స్ట్రైక్ రేట్‌తో 467 పరుగులు చేయగా.. మన వైభవ్ ఏకంగా 233.63 భీకరమైన స్ట్రైక్ రేట్‌తో ఈ ఘనత సాధించడం విశేషం. అతని విధ్వంసకర బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే టీ20 క్రికెట్‌కు సరికొత్త ల్యాండ్‌మార్క్‌ను సెట్ చేసినట్లు కనిపిస్తోంది.

IPL 2026 Qualifier 2 Rajasthan Royals Prodigy Vaibhav Suryavanshi Becomes First Batter with 500 Powerplay Runs

పవర్‌ప్లే బాద్‌షా.. మ్యాచ్‌లను ఏకపక్షం చేస్తున్న సంచలనం!

వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్‌లు రాజస్థాన్ రాయల్స్‌కు పవర్‌ప్లేలోనే సగం విజయాన్ని ఖాయం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో అతను సాధించిన మొత్తం పరుగులలో దాదాపు మూడు వంతుల పరుగులు మొదటి ఆరు ఓవర్లలోనే రావడం విశేషం. ఫీల్డింగ్ ఆంక్షలను పూర్తిగా వాడుకుంటూ, బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా సాగుతున్న అతని బ్యాటింగ్.. ప్రత్యర్థి కెప్టెన్లకు మైండ్ బ్లాక్ చేస్తోంది. గత ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సంచలనం సృష్టించిన వైభవ్.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్ 2 లోనూ అదే జోరు చూపిస్తూ 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు బాదాడు.

 వైభవ్ సూర్యవంశీ ఆస్తుల లెక్కలు.. బ్రాండ్ విలువ ఎంతో తెలుసా..!?
వైభవ్ సూర్యవంశీ ఆస్తుల లెక్కలు.. బ్రాండ్ విలువ ఎంతో తెలుసా..!?

ఆల్-టైమ్ లెజెండ్స్ లిస్ట్‌లో టాప్.. సరికొత్త టీ20 శకం!

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టాప్ లీగ్‌లోకి చూస్తే.. ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు:

  • వైభవ్ సూర్యవంశీ (2026): 521 పరుగులు (SR: 233.63)
  • డేవిడ్ వార్నర్ (2016): 467 పరుగులు (SR: 150.16)
  • ట్రావిస్ హెడ్ (2024): 402 పరుగులు (SR: 208.29)
  • సాయి సుదర్శన్ (2025): 402 పరుగులు (SR: 155.81)
IPL 2026 Winner AI Prediction: ఈసారి ఐపీఎల్ టైటిల్ వారికే..! తేల్చేసిన ఏఐ..!
IPL 2026 Winner AI Prediction: ఈసారి ఐపీఎల్ టైటిల్ వారికే..! తేల్చేసిన ఏఐ..!

రికార్డుల వేటగాడు.. రాజస్థాన్ ఫైనల్ ఆశలు!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, అతి తక్కువ వయసులో సెంచరీ బాదిన ఘనుడిగా ఇప్పటికే రికార్డులెక్కిన వైభవ్, ఇప్పుడు పవర్‌ప్లే కింగ్‌గా తదుపరి తరం క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా మారాడు. రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా దూసుకుపోతుండగా.. ప్రత్యర్థి జట్లు ఈ రికార్డుల వేటగాడిని మొదటి 2 ఓవర్లలోనే అవుట్ చేయకపోతే, మ్యాచ్‌లను చేతులారా సమర్పించుకోవాల్సిందేనని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+