లగడపాటికి అంత సీన్ లేదు: హరీష్ రావు

Harish Rao
హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ సీట్ల వ్యవహారంపై దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ తమ పార్టీ అధినేత అధినేత కె. చంద్రశేఖర రావుకు సవాల్ విసిరిన విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు మండిపడ్డారు. లగడపాటికి అంత సీన్ లేదని స్పష్టం చేశారు. లగడపాటికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క పీజీ విద్యార్థి చాలని తెరాస శాసనసభ్యుడు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట పాత బస్టాండు వద్ద కొనసాగుతున్న తెలంగాణ రిలే నిరాహార దీక్షలకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపి అనంతరం మాట్లాడారు.

"శనివారం ఓ టీవీ చానల్‌లో లగడపాటికి, నాకు మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లగడపాటి అర్ధంతరంగా వెళ్లిపోయాడు. అలాంటి వ్యక్తి చర్చకు రావాలంటూ కేసీఆర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటు. లగడపాటితో చర్చించడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క విద్యార్థి చాలు'' అని ఆయన విరుచుకుపడ్డారు. త్వరలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమని, అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తమ పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించే స్థాయి, అర్హత లగడపాటికి లేవని సిరిసిల్ల శాసనసభ్యుడు కె.తారకరామారావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు "లగడపాటి చాలా చిన్న స్థాయి మనిషి. తెలంగాణలోని ఏ పౌరుడైనా ఆయనతో చర్చించగలడు. కేసీఆర్‌తో చర్చించే సీన్ లగడపాటికి లేదు. ఆయనతో చర్చించడానికి పార్టీలో సమర్థులైన నాయకులు చాలా మంది ఉన్నారు. వారు సిద్ధం'' అని వ్యాఖ్యానించారు.

ప్రచారంలో ఉండడం కోసమే లగడపాటి తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించకపోతే తెరాస ఆందోళనలకు శ్రీకారం చుడుతుందని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా కృష్ణా డెల్టాకు నీరిస్తున్నారని, సమైక్య పాలనలో జల దోపిడీ జరుగుతోందని, దీనిని ఆపేవరకూ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఉద్యమం, రాజకీయం అనే జోడు గుర్రాలపై స్వారీ చేస్తూ తెలంగాణ సాధనకు కృషి చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+