పొన్నాలకు ఊరట: జగన్ కేసులో న్యాయ సహాయం

Ponnala Laxmaiah
హైదరాబాద్: వైయస్స్రాక్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా ఊరట లభించింది. కేసులో పొన్నాల లక్ష్మయ్యకు న్యాయ సహాయం అందజేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు నలుగురు మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మినారాయణకు న్యాయసహాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పొన్నాల లక్ష్మయ్య, మోపిదేవి వెంకటరమణలను మాత్రం పక్కన పెట్టింది. దీంతో పలు అనుమానాలు కలిగాయి. అయితే, తమకు సహాయం అందించాలని కోరుతూ లేఖలు రాసిన మంత్రులకు మాత్రమే సహాయం అందిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, పొన్నాల లక్ష్మయ్య లేఖ రాయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారని, అయితే అది కనిపించకుండా పోయందని ఆ తర్వాత తెలిసింది.దాంతో పొన్నాల లక్ష్మయ్యతో మళ్లీ లేఖను తెప్పించుకుంది.

లేఖను అందుకున్న తర్వాత పొన్నాల లక్ష్మయ్యకు కూడా న్యాయ సహాయం అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్ జగన్ కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ న్యాయ సహాయం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, ఆయన లేఖను మాత్రం న్యాయ నిపుణుల సలహా కోసం పంపినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తులో వాదించడానికి మంత్రులు నియమించుకునే న్యాయవాదుల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 26 వివాదాస్పద జీవోలను జారీ చేసిన ఆరుగురు మంత్రులను వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారించాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పి. సుధాకర్ రెడ్డి న్యాయవాది వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 8 మంది ఐఎఎస్ అధికారులను కూడా విచారించాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐఎఎస్ అధికారుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+